*ఆర్టీసీ కార్మికులకు జీవో చట్ట ప్రకారం జీతాలు ఇవ్వాల్సిందే…
*ఆర్టీసీ సమస్త కు ఎలాంటి కోట్లు నష్టం వాటిల్లటం లేదని మేధావులు వెల్లడి…?
*ఆర్టీసీ సమస్త నష్టాల్లో ఉండకుండా భారతదేశానికి నిజాం కాలంలో ఖనిజ సంపదలు ఇచ్చి వెళ్ళిపోయారు…
*ప్రజా లారా ప్రజా స్వామిక వాదులారా బుద్ధి జీవులారా మేల్కొండి….
*అసెంబ్లీలో జరుగుతున్న చర్చ ఇన్ని కోట్లు నష్టం వాటిల్లిందని చెబుతున్న అంతా అబద్ధం…..?
A9 న్యూస్ మెదక్/సిద్దిపేట మార్చ్ 16:
ఆర్టీసీకీ మద్దతు గా….
కార్మికులారా కర్షకులారావిద్యార్థి యువజన యువతి యువకుల్లారా మహిళల ఈరోజు మనం చూస్తున్న ఆర్టీసీ ఎలా ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండేది విడిపోయాక బంగారు తెలంగాణ చేస్తామన్న పాలకుల కను సన్నల్లో ఎలా ఉండేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆర్టీసీ నష్టాలకు కారకులెవరు లాభాల్లో నడవలసిన కార్పొరేషన్ ఎందుకు నష్టాల్లో నడుస్తుంది ఈ నష్టాలకు కార్మికుల కష్టాలకు కారణాలేంటి అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేడు మనం చూస్తున్న ఆర్టీసీ సంస్థ ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థ గా ఉండేది అత్యధిక వసతులు కలిగి అతి పెద్ద రవాణా సంస్థగా ఉండేది అంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం ఒకప్పుడు ఆర్టీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది దేశ స్వాతంత్రానికి ముందే హైదరాబాదు రాజ్యాన్ని పాలించిన నిజాం నవాబు కోడలు ప్రజల కష్టాలు చూడలేక ప్రజా రవాణా వ్యవస్థను తన సొంత డబ్బులతో స్థాపించింది నిజం ప్రభువు కోడలుఅయినా జోగురా బేగం టర్కీ దేశం రాజకుమారి ఆమె ఒకరోజు హైదరాబాద్ నగరవీ దులు వెంట పల్లకిపై సంచరిస్తుంది ఆ సమయంలో నాంపల్లి రైల్వే స్టేషన్లు నుండి నెత్తినమూటలు కట్టుకొని సంకలో పిల్లలను ఎత్తుకొని ముసలి ముతక వికలాంగులు రోడ్ల వెంట అవస్థలు పడుతూ నడుచుకుంటూ వెళ్లడం చూసింది ప్రజలను ఆపి ఎక్కడ నుండి వస్తున్నారు అని ప్రయాణికులను అడిగి తెలుసుకుంది కొందరు నాందేడ్ ఔరంగాబాద్ పర్బని వరంగల్ మరికొందరు గుల్బర్గా ఇంకొందరు గ్రామాలు నుండి నడిచి వస్తున్నామని బాధగా చెప్పారు ప్రజలు నడుచుకుంటూ ఒక చోటు నుండి మరోచోటికి వెళ్తున్నారా ఇదేంటి మనమంతా మనుషులేమే కదా నేను పల్లకిలో వెళ్ళడమేంటి వీళ్ళు నడవడం ఏంటి అని ఆలోచన లో పడిందట ఈ పద్ధతి మార్చారని ప్రజల కష్టాలకు స్వాంతనచెప్పాలని నిర్ణయించుకుందట వెంటనే తన మామ అయిన నిజాం ప్రభువుకు ప్రజల కష్టాలు తెలిపింది తన పుట్టింటి వారి నుండి బహుమతిగా వచ్చిన బంగారు నగలు వజ్రాభరణాలు డబ్బులు ఇచ్చి ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయించింది 3 లక్షల 93 వేల రూపాయల మూలధనంతో మొదట్లో 9 బస్సు డిపోలు 27 బస్సులతో హైదరాబాద్ నాందేడ్ వరంగల్ పర్బానిగుల్బర్గా రాయచూర్ వనపర్తి లాంటి పట్టణాలకు రైల్వే స్టేషన్ నుండి మిగతా పట్టణాలకు బస్సులు నడిచేలా ఏర్పాటు చేయించింది ఆనా టి రవాణా వ్యవస్థకు నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా అంటే ఎన్ఎస్ఆర్టిడి అని పేరు పెట్టుకున్నారు అప్పటినుండి జోగురా బేగం గౌరవార్థం ఆమె పేరు మొదటి అక్షరం జెడ్లు బస్సు నెంబర్ ప్లేట్లపై రాసేఆనవాయితీ వచ్చింది. అందుకే బస్సు నెంబర్లు ఏపీ జెడ్ టీఎస్ జెడ్ టీజీ జెడ్ అని రాస్తున్నారు నిజాం కాలంలో భారతదేశం అని ఒక దేశం లె నే లేదు బ్రిటిష్ ఇండియా మాత్రమే ఉండేది బ్రిటిషర్లు పాలిస్తున్న ఇండియాలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రజా రవాణా వ్యవస్థ లేదు కొంతకాలానికి ఈ ప్రజా రవాణా వ్యవస్థను రైల్వే శాఖ నుండి వేరు చేసి ఎన్.ఆర్.టి.డి అని పేరు మార్చి నిజాం ప్రభుత్వంలో కలిపారు నిజాం పాలనలో మొదలైన ప్రజా రవాణా వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా చాలా కాలం ప్రభుత్వ రంగ సంస్థ గానే కొనసాగింది 1948లో హైదరాబాద్ విమోచన జరిగి హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది హైదరాబాదు రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోఈ వ్యవస్థ ప్రభుత్వ సంస్థ గానే నడిచేది 1956లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1958 లో ఆర్టీసీ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ యాజమాన్య సంస్థగా మారింది నియంతగా పేరున్న నిజాం నవాబు కాలంలో లాభాల పట్ల నడిచిన ఆర్టీసీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ యాజమాన్య సంస్థగా ఏర్పడిన తర్వాత నష్టాలకు అంకురార్పణ జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలు ప్రభుత్వంలో విలీనం చేసింది కానీ బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పి అరచేతులు వైకుంఠ చూపెట్టిన గత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ ము నుండి వేరుచేసి ప్రైవేట్ పరం చేస్తానని కార్మికులనువేధించాడు ప్రపంచంలోనే ప్రజా రవాణా వ్యవస్థగా పేరొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఆర్టీసీగా గిన్నిస్ రికార్డు బుక్కు దక్కింది 1932లో కేవలం 9 బస్ డిపోలు 27 బస్సులు 166 మంది సిబ్బందితో ప్రారంభమైన ప్రజా రవాణా వ్యవస్థ ఇప్పుడు టీజీఎస్ ఆర్టీసీ సంస్థగా 10,46 బస్సులు మూడు జోన్లు 11 రీజియన్లు 363 రూట్లలో బస్సు దిగుతుంది ఆర్టీసీకి సొంత బస్సులు 8320 అద్దె బస్సులు 2140 గరుడ రాజధాని వజ్రవాసులు 344 సూపర్ లగ్జరీ డీలక్స్ ఎక్స్ప్రెస్ సెమీ ఎక్స్ప్రెస్ బస్సులు2526 పల్లె వెలుగు మినీ పల్లె వెలుగు బస్సులు 3744 సిటీ బస్సులు 3 716 ఎలక్ట్రిక్ బస్సులు 40 డిపోలు97 బస్ స్టేషన్లు 364 గా వర్ధిల్లుతోంది ఈ బస్సులు ప్రతిరోజు 35 లక్షల ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు దూరం కవర్ చేస్తూ రోజుకు ఒక కోటి 30 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకుచేరుస్తున్నాయి. రోజుకు సగటున 11 కోట్ల 38 లక్షలరూపాయల ఆదాయం తెస్తుంది 50 వేల 31 మంది ఉద్యోగులు ఉన్నారు కార్మిక సంఘం నాయకులు కార్మికులు ఆర్టీసీని పరాయి చేసి చూస్తుందనివాపోతున్నారు. ప్రభుత్వం నుండి రావలసినబకాయలు సంస్థకు చెల్లించకుండా మొండి చేయి చూపుతోందని కార్మికులు మేధావులు అంటున్నారు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఆర్టిసి కి ఉన్న అప్పులు 300 కోట్లు సంస్థకు ఏడాదిగా వస్తున్న నష్టం 700 కోట్లు మోటార్ వెహికల్ టాక్స్ కింద ప్రభుత్వానికి ఏటారెండు వందల కోట్లు చెల్లిస్తుంది ప్రస్తుతం అది 240 కోట్లకు చేరుకుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 ఎండలో సంస్థ ప్రభుత్వానికి పన్నులరూపంలో చెల్లిస్తున్నది1200 కోట్లకు పైనే అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు చెప్తున్నారు. ప్రభుత్వం విద్య ఆరోగ్య సంస్థలకు పనులు విధించడం లేదు ప్రజా రవాణాసంస్థ పై పనులు వేయడం ఏమిటి అనిమేధావులు కార్మికులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు వ్యాపార సంస్థలకు విధించినట్టు ప్రజాసేవలో నడుస్తున్న ఆర్టీసీని పనులు విధించడం ఏంటి అని వారు అంటున్నారు ప్రజాసేవలో నడుస్తున్న ఆర్టీసీపై పనులు వేయకూడదని వారు కోరుతున్నారు. ఏటారెండు వందల పై కోట్లు ప్రభుత్వం ఆర్టీసీ నుండి ముక్కు పిండివసూలు చేస్తు సంస్థ నష్టాల్లోనడుస్తుందని చెప్పడం ఏంటివారు ప్రశ్నిస్తున్నారు కొన్ని రూట్లలో నష్టం వస్తున్న ప్రజల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు దీంతో కూడా సంస్థకు నష్టాలు వస్తున్నాయి సంస్థలు నష్టాలనుండి బయటపడేసి మార్గాలు వెతకవలసినప్రభుత్వం ఆర్టీసీని పరాయిని చూసి చూస్తుందని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు వాపోతున్నారు నష్టాల్లో నడిచే రూట్లలో పన్నులు వసూలు చేయొద్దని వేడుకుంటున్నారు ఆర్టీసీ నుండి516 కోట్ల పనులు అప్పనంగా తీసుకుంటూ సంస్థ నష్టాలల్లో ఉన్న సంస్థను మరింత నష్టాల్లోకి నెడుతుందని అంటున్నారు కార్మిక సంఘం నాయకులు కార్మికులు ప్రభుత్వం వెహికల్ టాక్స్ ఇంధనం పైపన్ను లేకపోతే ఆర్టీసీకి ఏటా 700 కోట్లు మిగులు ఉంటుందని పలువురు మేధావులు అంటున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి 4 ఏళ్లలో 2208కోట్ల భారం సంస్థపై పడింది ఇందులో ప్రభుత్వం తిరిగి ఇచ్చింది 500 కోట్లు మాత్రమే ఆర్టీసీకి ఇంకా 1700 కోట్లు చెల్లించాల్సి ఉంది ఈ నిధులు చెల్లించకుండా సంస్థకు బ్యాంకు రుణాలు తీస్తూ అప్పులపై వడ్డీ కట్టిస్తుంది మొత్తం మీద ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కాదని ఉద్యోగులు అంతకన్నా కాని కాదని ప్రభుత్వం విధిస్తున్న అత్యధిక పనులేనని సంస్థకు రావలసిన బకాయలు చెల్లించకపోవడం రాయితీలుకల్పించకపోవడమేనని పలువురు మేధావులు వాదిస్తున్నారు గతమెంతో ఘనకీర్తి గలిగిన నియంత అనుకునేటువంటి నిజాం కాలంలో ప్రజా రవాణా వ్యవస్థగా పేరుపొంది సొంత రాష్ట్రం వస్తే బాగుపడదామనుకున్నటువంటి కార్మికుల కష్టాలు ఇంకా నెరవేరినే లేదు కార్మికులు తమ పండుగలను పబ్బా లనువదులుకొని నిరంతరం పాటుపడుతున్నారు ఆర్టీసీకి సంబంధించిన అనేక అంశాలను తాము పరిష్కరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వారికి రావలసిన హక్కుల్ని వారి డిమాండ్లను నెరవేరుస్తారని ఆశిద్దాం
1 ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచనలను ప్రభుత్వాలు విరమించుకోవాలి…
2 ఆర్టీసీ ఉద్యోగులకు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి…
3 ఈఎస్ఐ పిఎఫ్ డిఏ లాంటి ఇతర ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలి…
4 స్టూడెంట్ వికలాంగులు రైతులు వృద్ధులు జర్నలిస్టులకు ఇచ్చే రాయితీలు తప్ప మిగతా రాయితీలను రద్దు చేయాలి…
ఇప్పటికే సంస్థ నష్టాలు నడుస్తున్నదని ప్రచారం చేస్తూ ఈ సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సావుగా చూపి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. కొత్త బస్సులను ప్రవేశపెడతామన్న వారు మూడు నాలుగు డిపోలలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు ఈ ఎలక్ట్రిక్ బస్సులు మెయింటన్ కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలి అని అనుకుంటున్నట్టు కార్మికులు తెలియజేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకుల ఆరోపణలపై ఎలాంటి స్పందన లేకపోవడం వలన కార్మికులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న తప్పులకు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు క్రమ క్రమంగా ఆర్టిసిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు తమకు శిక్షణ ఇస్తే తాము కూడా ఎలక్ట్రికల్ బస్సులు నడిపే సామర్ధ్యాన్ని పొందుతామని ప్రభుత్వం దీనిపై ఆలోచించి తమకు శిక్షణ ఇవ్వాలని కార్మికులు కోరుకుంటున్నారు ఇకపోతే కార్మికులు డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి వాడుకోవడం గురించి సరేగాని తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వాలని వారు కోరుతున్నారు
నియంత నిజాం కాలంలో ప్రజా రవాణా వ్యవస్థగా పేరోంది దినఆర్టీసీ నష్టాలకు కారకులు పాలకులే తప్ప కార్మికులు ఉద్యోగులు కానీ కాదు అన్నది స్పష్టం ఆర్టీసీ కార్మికుల ఈ న్యాయమైన డిమాండ్లకు మా సంస్థ అంటే “నిరుపేదల హక్కుల సాధన సమితి”తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అంతేకాకుండా ముందు ముందు అనేక న్యాయమైన ప్రజా ఉద్యమాలకు తన మద్దతును సంఘీభావాన్ని తెలియజేస్తుంది చట్టపరిధిలో న్యాయ పరిధిలో జరిగే ప్రతి పోరాటానికి తమ యొక్క మద్దతును తెలియజేస్తున్నదని తెలియజేస్తున్నాం
ఇట్లు/
నిరుపేదల హక్కుల సాధన సమితి
తెలంగాణ రాష్ట్ర కమిటీ
సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ
జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి