నిజామాబాద్ A9 news

కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 9 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు, వీరికి సిఐటియు మండల కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు సిఐటియు నాయకులు మండల కన్వీనర్ కూతాడు ఎల్లయ్య, ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీగా వెళుతూ ఎమ్మార్వో కార్యాలయం ముందు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు వచ్చి అక్కడ మానవహారం 10నిమిషాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఏఎన్ఎం ల సమస్యలను తొందరగా పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలగాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతిపత్రం సమస్యలతో కూడినటువంటిది ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కరోనా సమయంలో వాళ్ల ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఇల్లు ఇల్లు తిరుగుతూ, మీరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ముందుండి ప్రచారం చేసి వ్యాక్సిన్ వేసినారన్నారు. దగ్గు, దమ్ము వచ్చిన వారికి మందులు సప్లై చేస్తారు.

అట్లాగే గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేసి ముర్రుపాలను పిల్లలకు త్రాగించడంలో ముందు వరసలో ఉంటారన్నారు. చాలీచాలని వేతనాలతో పిల్లలను పై చదువులు చదివించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే వేతనము సరిపోవటం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా పది లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టు ఏఎన్ఎంల చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు ఏ ఎన్ ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *