నిజామాబాద్ A9 news
– పట్టణ అభివృద్ధి పై ప్రజల్లో చర్చ జరగాలి
– పట్టణ ప్రగతిలో మరింత ముందుకు పోదాం
– 30వ వార్డులో సీసీరోడ్లు,డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ
-*నమస్తే నవనాధపురం” కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి*
-30వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలించిన ఎమ్మెల్యే
అభివృద్ధి, సంక్షేమమే మన ఆయుధమని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు
“నమస్తే నవనాధపురం” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శనివారం ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు , వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో జీవన్ రెడ్డిని సన్మానించారు.
“జై జీవనన్న, జైజై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్ , జై తెలంగాణ” వంటి నినాదాలతో 30వ వార్డు మారుమోగింది. ఆయన 30వ వార్డు లో గల్లీ గల్లీ లో కలియతిరిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. అన్ని వీధుల్లో ప్రజలతో మాట్లాడుతూ మిషన్ భగీరథ మంచినీళ్లు వస్తున్నాయా?, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా?, మీ వార్డులో ఇంకా సమస్యలేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఆలూరు రోడ్డు గంగపుత్ర సంఘం నుంచి రజక సంఘం మీదుగా పెద్ద బజార్ వరకు 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డుకు జీవన్ రెడ్డి భూమి పూజ నిర్వహించి రేపటి నుంచే పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన 500 కుటుంబాల వారు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 30వ వార్డు రజక సంఘం సభ్యులు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అక్కడ రజక సంఘం ఫంక్షన్ హాల్
నిర్మాణం కోసం స్థలం కేటాయించడం తో పాటు నిర్మాణం కోసం రూ.15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఫంక్షన్ హాల్ ను గుండ్ల చెరువు దగ్గర నిర్మించనున్నారు. కాగా విశ్వబ్రాహ్మణ సంఘం భవనానికి రూ. 5 లక్షలు,
మాదిగ సంఘం భవనానికి స్థల కేటాయింపుతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సిద్ధులగుట్ట వెనుక భాగం నుంచి వర్షం వల్ల ఇండ్ల పైకి వచ్చే నీటిని నిల్వ ఉండకుండా సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆర్మూర్ పట్టణ ‘ముదిరాజ్ కులస్తులకు జిరాయత్ నగర్ కాలనీ సమీపంలో’ 1500 గజాల స్థలాన్ని కేటాయిస్తామని జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ స్థలంలో చేపట్టనున్న ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50 లక్షల నిధులు మంజూరు చేసిన జీవన్ రెడ్డి భూమిపూజ కూడ నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని బంగారు వెండి వర్తక సంఘం కోసం 1000 గజాల స్థలాన్ని కేటాయించి స్థలంలో వారి అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టడానికి రూ. 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన 30వ వార్డు ప్రగతిపై సమీక్ష జరిపిన అనంతరం మాట్లాడుతూ ఆర్మూర్ ఆదర్శ పట్టణమన్నారు.
ఆర్మూర్ పట్టణం 2014కు ముందు ఎట్లుంది?, ఇప్పుడెట్లుంది? అని ఆయన అడిగారు.
పట్టణాభివృద్ధిపై ప్రజల్లో చర్చ జరగాలని పిలుపు నిచ్చారు.
పట్టణ ప్రగతిలో మరింత ముందుకు పోదామన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన
రూ.30కోట్లతో పట్టణంలో ముమ్మరంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు జీవన్ రెడ్డి చెప్పారు.
తాను నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని, వారికి జీతగాడిలా సేవ చేస్తానని ఆయన అన్నారు. తనను మళ్లీ దీవించాలని అర్ధించారు. హ్యాట్రిక్ విజయంతో ఆర్మూర్ రాజకీయ చరిత్రను తిరగరాస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.