A9 న్యూస్ ప్రతినిధి:
ధర్పల్లి గ్రామంలో వ్యాపారస్తులు, ప్రజలు తరచుగా ఎదుర్కొనే కరెంటు అధికలోడు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం ఎక్కడైతే అధికలోడుతో కరెంటు కోత విధించబడుతుందో అట్టి వార్డులను కరెంటు అధికారులు పరిశీలించి కరెంటు కోత సమస్యను పరిష్కరించాలని అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రోడ్డు ప్రాంగణంలో అధికలోడు సమస్యను పరిష్కరించడానికి ట్రాన్స్ఫార్మర్లను గ్రామ అభివృద్ధి కమిటీ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభోత్సవానికి కరెంటు అధికారులు డిఈ, ఏడి సంబంధిత సబ్ స్టేషన్ అధికారులు హాజరయ్యారు.