A9 న్యూస్ ప్రతినిధి:
*స్త్రీ పురుష సమానత్వానికై పోరాడాలి
*POW జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి పిలుపు
మహిళలపై జరుగుతున్న దాడులను అణిచివేతలను తిప్పి కొట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జక్రాన్ పెల్లి మండల కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా POW ప్రధాన కార్యదర్శి భారతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం 114 సంవత్సరాలు అయ్యిందని. మహిళలపై జరుగుతున్న దాడులు అణిచివేతలు హత్యాచారాలు మానభంగాలను తిప్పి కొట్టాలని దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈరోజు సమాజంలో మహిళలు హక్కులను కాపాడాలని గ్రామ గ్రామాన మహిళా దినోత్సవాలను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. మహిళలు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్నికల ముందు మహిళల కోసం పాలకవర్గ పార్టీలైన కేంద్రంలో ఉన్న బిజెపి మరియు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు మహిళలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇంతవరకు మహిళా సమస్యలు పరిష్కరించలేదని కేంద్రంలో మరియు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని మహిళల గురించి ఎన్ని చట్టాలు చేసినా కూడా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని ప్రతి మహిళ చైతన్యమై అన్యాయాల పైన తిరుగుబాటు చేయాలని అప్పుడే మహిళ ఆత్మ గౌరవానికి విలువలు ఉంటాయని వారు అన్నారు. ఇక రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలను ఇచ్చి ఇప్పుడు సంవత్సరం గడువు దాటిన ప్రతి మహిళలకు 2500 పింఛన్లు ఇస్తామని చెప్పి ఒంటరి మహిళ లకు 2000 పింఛన్లకు 4000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. సమాజంలో సగభాగం అయిన మహిళలకు వివక్షత సూపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేపు జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సభకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షురాలు ఇర్ల దివ్య, నాయకురాలు శ్యామల, బొంబాయి సప్న, కే సంగీత, పొన్నల శారద, లక్ష్మి, ఇఫ్ట్ నాయకులు బి.సూర్య శివాజీ, జేపీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు