*పట్టపగలే జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు…
*ఎమ్మార్వో హస్తం ఉన్నట్లేనా…?
*ఓ విలేఖరి ఫోన్ కాలుకు స్పందించని ఆర్డిఓ…
*ఇష్టానుసారంగా సీసీ రోడ్ల పేరుతో ఎక్కడికి అక్కడే ఇసుక డంపింగ్స్….
A9 న్యూస్ ప్రతినిధి:
ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో బ్రిడ్జికి ఇరుపక్కల గల చెరువులో నుండి పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జేసిబితో ఇసుక త్రవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల సహాయంతో గ్రామంలో ఇసుక తరలింపులను చేపడుతున్నారు. పేరు ఒకరిది ఊరు ఒకరిది అనే విధంగా సీసీ రోడ్డు కాంట్రాక్టర్ల పేరుతో తొందరగా సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని అధికారులను నమ్మబలికి సుమారు 40 నుండి 50 ట్రిప్పుల ఇసుక అక్రమ డంపింగ్లను చేపట్టడంతో అధికారులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. పట్టపగలే యాదేచ్చగా జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు కొనసాగించడం పై మండల రెవెన్యూ అధికారి హస్తం ఉన్నట్లు గ్రామంలో చర్చ కొనసాగుతుంది. ఇట్టి విషయం పై సంబంధిత మండల రెవెన్యూ అధికారిని వివరాలు కోరగా సీసీ రోడ్డు కొరకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కాని ఇసుక డంపింగ్ లు ఉన్న ప్రదేశంలో ఎలాంటి రోడ్డు పనులు ప్రారంభం కాక పోగా ఎక్కడో ఒక చోట ఇసుక డంపింగ్ లు ఉన్నట్లు వాటి చిత్రాలను ఫోన్ లో బందించడమైనది. దీనిపై స్పష్టత కోసం పోలీస్ అధికారులకు సమాచారం అందించేలోగా జేసీబీ తో చెరువులో ఇసుక త్రవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ సహాయంతో గ్రామంలో కొందరు ఇసుక తరలింపులు చేపట్టినట్లు ధర్పల్లి పోలీసు అధికారులకు సమాచారం అందటంతో వెంటనే జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు జరిపే ప్రదేశానికివచ్చి చూసేలోపే జేసీబీ ట్రాక్టర్స్ రోడ్డు పనులు చేపట్టినట్లు నటించడంతో పోలీస్ అధికారులు అక్కడినుండి వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపింగ్లు చేపట్టడంపై ఓ విలేకరి మాజీ సర్పంచ్ కొడుకు గంగారెడ్డి నీ జేసీబీ తో ఇసుక త్రవ్వకాలకు సంబందించిన మండల రెవెన్యూ అధికారి ముద్రిత ఆర్డర్ కాపీ ఇవ్వమని వివరాలు అడగగా ఇస్తానని ఇవ్వకపోగా తప్ప్పు త్రోవ పట్టిస్తు సీసీ రోడ్డు పనులను అధికారులు 15 రోజుల కాల వ్యవదిలో పూర్తి చేయమని కోరడంతో హడావిడిగా రోడ్డు పనులను తొందరగా పూర్తి చేయాలనే జేసీబీ సహాయంతో ఇసుక త్రవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో తరలించినట్లు తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం కొరకై జిల్లా ఆర్డీవో కు సమాచారం అందివ్వడం కొరకు ఫోన్ చేయగా ఆర్డిఓ ఫోన్ కు స్పందించకపోవడం గమనార్హం. పై అధికారులు ఎలాంటి విషయాలపై స్పందిస్తారు ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన అధికారులే సమయానికి స్పందించకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని విమర్శించారు. అయితే నిజంగా సీసీ రోడ్డు పనులను తొందరగా పూర్తిచేయాలనుకునే వారు గత రెండు నెలల క్రితం సీసీ రోడ్డు పనులను ప్రారంభించి పనులను వేగవంతం చేసి ముగిస్తే బాగుండేది అంటున్న గ్రామస్థులు. గ్రామంలో కొందరు కాకమ్మ కథలు చెప్పి ఇలా చట్టబద్ధమైన అధికార యంత్రంగాన్ని తప్పు త్రోవ పట్టించే విధంగా జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు చేపట్టడం పై పలు విమర్శలకు దారితీసాయి. అక్రమ ఇసుక రవాణాలపై అధికార యంత్రాంగం కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ సీసీ రోడ్డు కాంట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా దారులలో మారని తీరు అస్తవ్యస్తంగా మారిన ఇసుక మాఫియా సామాన్యులకు అందని ద్రాక్ష పండులా మారిన ఇసుక. అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహించిన అధికారులపై జిల్లా అధికార యంత్రాంగం తగిన చర్యలు చేపట్టి సామాన్యులు నిర్మించే ఇంటి నిర్మాణాల కొరకై ఇసుక అందేల చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.