విశ్వబ్రాహ్మణులుగా మాత్రమే నమోదు చేయాలి.. హైకోర్టు ఆదేశాలకు స్వాగతం : శ్రీరామ్ మహిపాల్ చారి…..

On: Wednesday, May 27, 2026 9:45 AM

 

అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ, కుల గణన సర్వే విషయంలో హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను స్వాగతిస్తున్నామని తెలిపారు. కంసాలి, వడ్ల, కంచరి, కమ్మరి, శిల్పి వంటి వృత్తుల వారిని వేరువేరు కులాలుగా పేర్కొనకుండా, వారందరినీ “విశ్వబ్రాహ్మణ” కులంగా మాత్రమే నమోదు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమన్నారు.

వేరువేరు కులాలుగా నమోదు చేయడం వలన విశ్వబ్రాహ్మణుల జనాభా తక్కువగా కనిపించి, ప్రభుత్వ పథకాల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అఖిల భారతీయ విశ్వకర్మ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

కుల గణన సర్వే నిర్వహించే అధికారులు ఈ విషయాన్ని గమనించి, కేవలం “విశ్వబ్రాహ్మణ” కులంగా మాత్రమే నమోదు చేసి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో విశ్వబ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

గౌడ సామాజిక వర్గం, చేనేత కార్మికులకు అందిస్తున్న విధంగా విశ్వకర్మ వృత్తిదారులకు కూడా 50 సంవత్సరాల వయస్సు నుంచే పింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని శ్రీరామ్ మహిపాల్ చారి తెలిపారు.

— అఖిల భారతీయ విశ్వకర్మ.

27 May 2026

Leave a Comment