తూప్రాన్ ప్రతినిధి మార్చి 5
జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో బుధవారం కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం గురించి కలెక్టర్ విద్యార్థినీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 06 ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమం అమలు జరుగుతున్నట్లు వివరించారు.
తెలుగు, చదవడం, ఇంగ్లీషులో చదవటం మరియు మాట్లాడడం, గణితంలో ఆడిషన్స్, సప్రాక్స న్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ లలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి తప్పొఒప్పులను సరి చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక పాఠశాలలో అమలు సత్ఫలితాలు దిశగా ముందుకు పోతుందని ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో అమలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు.ఫౌండేషన్ లెర్నింగ్ వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం కలెక్టర్
అంగన్వాడి సెంటర్ ను పరిశీలించారు. చిన్నారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని . ఈ సందర్భంగ మాట్లాడుతూ అంగన్వాడీలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని కోరారు. అంగన్వాడీల్లో తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు. చిన్నారులకు అధిక సంఖ్యలో ఆటవస్తువులు, బొమ్మలు అందుబాటులో ఉంచాలన్నారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వంటకు నాణ్యమైన సరుకులను కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. అంగన్‌వాడీ చిన్నారుల స్వచ్ఛమైన తాగునీరు అందివ్వాలన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉండాలన్నారు. అంగన్వాడీ పరిసరాలలో దోమలు వ్యాపించకుండా చెత్తను శుభ్రపరచాలి. చిన్నారులకు ఆటపాటలతో కూడిన చదువును నేర్పించాలని చెప్పారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.
చిన్నారుల తల్లిదండ్రులతో నెలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఎత్తు, బరువు వివరాలకు సంబంధించిన చిన్నారుల రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.