హకీంపేట్‌లో రైతుల రాస్తారోకో.. ఐకేపీకి లారీలు రాక ధాన్యం నిల్వలు పెండింగ్‌…..

On: Tuesday, May 26, 2026 4:14 PM

మెదక్ జిల్లా లోని మాసాపేట మండల్ పరిధిలో ఉన్న హకీంపేట్ గ్రామం వద్ద తూప్రాన్ బైపాస్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లే రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఐకేపీ కేంద్రానికి ధాన్యం తరలించేందుకు లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు మరియు ప్రభుత్వానికి సమస్యను తెలియజేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రైతులు నిరసనకు దిగినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

26 May 2026

Leave a Comment