హైదరాబాద్:ఫిబ్రవరి 05

తెలంగాణ ప్రభుత్వం బుధవారము రైతు భరోసా నిధులను విడుదల చేసింది, మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈరోజు ఉదయం ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేసింది, రేవంత్ సర్కార్..

 

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాలుగు కొత్త పథకాలను ప్రారంభిం చిన విషయం తెలిసిందే. అందులో రైతు భరోసా పథకం ఒకటి. గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లోకి రేవంత్ రెడ్డి జమ చేశారు.

 

అయితే, ఆరోజు సెలవు రోజు కావడంతో మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి తొలి విడతగా రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. అయితే, మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు జమ కాకపోవటంతో వారు ఆందోళన చెందుతున్నారు.

 

రాష్ట్రంలో ఎకరం భూమి కలిగిన రైతులకు ఇవాళ రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.

 

ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు సంబం ధించి మొత్తం 17.03 లక్షల రైతుల అకౌంట్లకు రైతు భరోసా నిధులు ఇవాళ జమ అవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వీటిని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

అయితే, ఎకరంకు పైబడి పొలం కలిగిన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తా యనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దశల వారిగా ఎకరం, రెండెకరాలు.. ఐదెకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లు తెలుస్తుంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *