హైదరాబాద్:జనవరి 30
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఫోన్లకే హాల్ టికెట్లు రానున్నాయి. గతంలో కేవలం కాలేజీలకే హాల్ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలనే వారు. ఇప్పుడు విద్యార్థు లు ఇచ్చిన ఫోన్ నంబర్కు నేరుగా హాల్ టికెట్ లింక్ను ఇంటర్ బోర్డు పంపించనుం ది.
ఆ లింక్లో డౌన్లోడ్ చేసు కొని ప్రింట్ తీసుకో వాలని ఓ అధికారి తెలిపారు. ఏవైన సందేహాలుంటే కాలేజీ సిబ్బందిని అడిగి తెలుసుకోవాలన్నారు. డౌన్‌లోడ్ చేసుకునేందుకు సమస్యలు తలెత్తితే కళాశాలకు వచ్చి సమస్య తెలియజేయాలన్నారు.
ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంట ర్నల్ పరీక్షలు జరుగుతు న్నందున ఇప్పటికే హాల్ టికెట్లను విద్యార్థులకు పంపించారు. సెకండ్ ఉయర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. వారి కూడా త్వరలోనే పంపిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకాను న్నారు.