*మామిడిపల్లి (హైదారాబాద్) బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చదువుకు డే స్కాలర్స్ కి అనుమతి*

 

*అవగాహన లేక రాష్ట్రాలు దాటుతున్న స్థానిక విద్యార్థులు*

 

*తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య, ఉజ్యల భవిష్యత్ సొంతం చేసుకునే అవకాశం*

 

*2025 ప్రవేశ పరీక్షకు అప్లికేషన్ లు ప్రారంభం*

 

ఇంటర్మీడియట్ విద్య పూర్తయింది అయితే చాలు తమ పిల్లలను మంచి కళాశాలలో చదివించాలని కోరిక తల్లిదండ్రులకు ఉండటం మామూలే. ఈ క్రమంలో జేఈఈ, ఎంసెట్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు వారి వారి ర్యాంకుల ఆధారంగా స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచి, విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పిస్తున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల కోసం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి నార్త్, సౌత్ రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీల వైపు చూస్తున్నారు. అక్కడ లక్షల ఫీజులు చెల్లించి అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఇంటికి వేల కిలోమీటర్ల దూరంగా ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల చదువు కొనసాగే తీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయలేక పోతున్నారు.

 

*సింబియాసిస్ ఉందిగా…*

 

షాద్ నగర్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో సింబియాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటై సుమారు 17 ఏళ్లు కావస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న యూనివర్సిటీలో 20కి పైగా చెందిన దేశాల విద్యార్థులు ప్రస్తుతం చదువుకుంటున్నారు. అయితే ఈ యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుండి ఇందులో ఇంజనీరింగ్ కోర్సు ఉండేది కాదు. 2024 లోనే సింబియాసిస్ యాజమాన్యం ఈ హైదరాబాద్ బ్రాంచ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఇంజనీరింగ్) కోర్సును ప్రారంభించింది. అంతేకాదు ఎప్పుడు లేని విధంగా స్థానికులు, చుట్టుపక్కల వారికి అవకాశం కల్పించేందుకు డే స్కాలర్స్ కు అనుమతించింది. అయితే ఈ విషయంలో స్థానికంగా ఉన్న ప్రజానీకానికి, విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఇంజనీరింగు చదువుల కోసం పక్క రాష్ట్రాల్లో ఉన్న యూనివర్శిటీ లను ఆశ్రయించే పనిలో ఉన్నారు. నోయిడా, బెంగళూరు, దుబాయ్, మహారాష్ట్ర, పూణే , నాసిక్, నాగ పూర్, హైదరాబాద్ ఇలా మొత్తంగా 43 బ్రాంచ్ లు ఉన్నాయి. ఇందులో సుమారుగా 80కి పైగా దేశాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. 1971లో ప్రారంభమైన సింబయాసిస్ యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించిందని చెప్పవచ్చు.

 

*అంతా పారదర్శకం…*

 

ఈ యూనివర్శిటీ లో చేరాలంటే ఎవరి రికమండేషన్లు పనిచేయవు. సింబయోసిస్ యూనివర్సిటీ కి సంబంధించి siteee ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు ఆయా క్యాంపస్ ల నిర్వాహకులు మెరిట్ లిస్ట్ ప్రకారం అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు ఉండవు. సింబాసిస్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యలో తరగతి గదికి 30 మంది మాత్రమే విద్యార్థులు ఉంటారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ ఐఆర్ఎఫ్) లో 31 స్థానంలో నిలిచిన సింబియాసిస్ యూనివర్సిటీ హైదరాబాద్ బ్రాంచ్ లో బయటి కళాశాలలతో పోల్చుకుంటే తక్కువ ఫీజుతో ఇంజనీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులతోపాటు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

 

*Siteee దరఖాస్తులు ప్రారంభం*…

 

సిరియాసిస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్య కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ అప్లికేషన్ కు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 12 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ తోపాటు విద్యార్థులు ఏ బ్రాంచ్, క్యాంపస్లో సీటు కావాలో అప్లై చేసుకోవాలి. విద్యార్థులు రాసిన సదరు పరీక్షల ఫలితాలను వారు ఎంచుకున్న క్యాంపస్లకు పంపి అక్కడ వచ్చిన మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. Siteee ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే 5, మే 11 రెండు తేదీలలో నిర్వహిస్తారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *