A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో విషాదం. పోచవ్వ (50) సంవత్సరాల మహిళ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి చూడగా మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమయింది. మృతురాలు బాన్సువాడ మండలం మిర్జాపూర్ గ్రామ వాసిగా గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకుతెరువు కోసం గోవింద్ పెట్ వచ్చి కూలి నాలి చేస్తూ జీవనం సాగించేది .మృతిరానికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉండగా వారితో ఈమెకు ఎటువంటి సంబంధం లేకుండా గోవిందపేటలో జీవనం సాగిస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్స్ సేకరించి జాగిలం సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.