నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణం తెలంగాణ ప్రభుత్వ అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురువారం, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సేవలను అందిస్తున్న తరుణంలో ఆర్మూర్ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా 108, 102 వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించి ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు.
పాత వాహనాలు 5 లక్షల పై చీలుకు రవాణా చేయడం వలన అవి పనికిరావు అని ఉద్దేశంతో కొత్త వాహనాలను ప్రభుత్వం ప్రజల సౌకర్య నిమిత్తం అందించడం సంతోషదాయకం అన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా తమ వ్యాధుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవడం ఆర్థిక స్తోమత లేని వారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ.పి. పెరగడం సంతోషదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ అమృత్ రాంరెడ్డి, డాక్టర్ అజయ్, డాక్టర్ సుమంత్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ పల్లవి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ హేమలత, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్ను, బి.ఆర్.ఎస్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లూ, తలారి మీనా చందు, రంగన్న, ఫయజ్, పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.