నిజామాబాద్ A9 news
ఆర్మూర్ మండలం కోమన్ పల్లి గ్రామ ప్రజలు ఆర్మూర్ తహసిల్దార్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఈ సందర్భంగా పల్లికొండ నారాయణ, గొర్రె కర్రెన్న, రోహన్ గౌడ్ లు మాట్లాడుతూ, పూర్వం తాత ముత్తాతల కాలం నుండి గ్రామానికి గ్రామ ప్రజలకు అప్పటి గ్రామ ప్రజలైనటువంటి శ్యాంసుందర్ రెడ్డి, వెంకటరామిరెడ్డిలు 1981 వ సంవత్సరంలో గ్రామ అభివృద్ధి కొరకు సర్వే నెంబర్ 402.407 లో గల 32 గుంటలు భూమిని విరాళంగా ఇచ్చారు.
ఆ ఇచ్చిన భూమిని గ్రామంలో బడికి, గుడికి, శ్మశానవాటిక కొరకు విరాళంగా ఇచ్చారు. వారు కరోనాలో చనిపోయిన తరువాత ఇప్పుడు వచ్చి భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులచే సంతకాలు చేయించుకొని భూమిని కబ్జాకు ప్రయత్నిస్తున్నారు.
కావున మా గ్రామానికి చెందిన భూమిని కబ్జా నుండి విముక్తి చేయాలని కోరారు. అలాగే ఎవరిని కుల బహిష్కరించడం జరగలేదు. ఎవరివద్ద డబ్బులు అడగలేము అన్నారు. మేము భూమి కోరకు తిరిగిన ఖర్చులను మాత్రమే అడిగాం తప్ప ఎలాంటి ఫైన్ విధించలేదు అన్నారు.
దీనికి వి.డి.సి కి సంబంధం లేదన్నారు. వి. డి. సి. అధ్యక్షుడు రోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఎగుడా ప్రశాంత్, కార్యదర్శి చిన్న రాములు, సభ్యులు చంటి, పోషన్న, గొర్రె జానీ, రాజు, చాకలి శ్రీనివాస్, బండి సహదేవ్, కొండూరు నారాయణ, గ్రామస్తులు ఉన్నారు.