నిజామాబాద్ A9 news
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో 220 మంది గ్రామస్తులు, 600 మంది విద్యార్థులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ముందుగా ఈ కంటి వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ డైరెక్టర్ సుచరిత రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం కండ్ల కలత 3 వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి అవుతుందని, మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కంటి చూపు పై త్రివ ప్రభావం ఉంటుందన్నారు.
మానవుడికి అతి ముఖ్యమైన సున్నితమైన అవయం కన్ను అని, ఏ చిన్న ఇబ్బంది అయినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, 83 నాటు వైద్యం చేయించుకోవడం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
అతి త్వరలో వివిధ దశల్లో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తాం అని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షించి, అవసరం మేరకు మందులు, కంటి అద్దాలు కూడా ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ గోపి కృష్ణ, సురేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, భూమేశ్ పాల్గొన్నారు.