నిజామాబాద్ A9 news

ఆర్మూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం లను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నిరడి రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫామ్ లను అందజేయడం సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థులు మంచి చదువులు చదువుకొని తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్య కమిటీ చైర్మన్ అంబటి గంగారం, వీడిసి చైర్మన్ రోహన్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *