రాజన్న జిల్లా: జనవరి 08
ఆటలను జీవితంలో ఒక భాగంగా పెట్టుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని యువతకు రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, సూచించారు.
రాజన్న జిల్లా రుద్రాంగి మండలంలోని మానాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈపోటీలను జిల్లా ఎస్పీ, తోపాటు..అదనపు ఎస్పీ శేషాద్రి, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈరోజు ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువత జాతీయ స్థాయిలో రాణించాలని ఏ ఆటలోనైనా గెలుపు ఓటములు అనేది సహజమని, కానీ చివరి వరకు పోరాడాలి అని అప్పుడే విజయం మన చెంతకు చేరుతుందని, అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్యంతో చదువు తోపాటు క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు అశోక్, అంజయ్య, అధిక సంఖ్యలో క్రీడాకారులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
రెండురోజుల పాటు జరుగనున్న పోటీల్లో మారుమూల గ్రామాలకు చెందిన 15 జట్లు పాల్గొననున్నాయి. ఈ మేరకు క్రీడాకారులకు పోలీస్ సిబ్బంది వాలీబాల్ కిట్లను అందజేశారు.
జీవితంలో ఆటలు అనేవి ఒక భాగంగా పెట్టుకొని తమకు నచ్చిన ఆటనలను ఆడి మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉదయం వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమలో నిర్మల్ రూరల్ సీఐ వెంకట్, సర్పంచ్ సుంగన్న, గ్రామ పెద్ద నాగోరావు, జెడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ వంగ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు