పెద్దపల్లి జిల్లా జనవరి 08
అసలు వీళ్లు మనుషు లేనా.? రానురానూ మానవత్వం కూడా మంట గలిసిపోతోంది, కొందరు అమ్మతనానికి మచ్చ తెచ్చి పెడుతున్నారు.కొందరయితే జాలి, దయ అనే వాటిని మరిచి, పాశవికంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఓ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పెద్దపల్లి లోని కూనారం గేటు సమీపంలో ట్రాక్ మధ్యలో రెండు నెలల వయస్సు ఉన్న మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళి పోయారు. రైల్వే సిబ్బందికి పసికందు ఏడుపు వినిపిం చడంతో.. పోలీసులకు సమాచారం అందించారు.
రామగుండం రైల్వే సీఐ సురేష్ గౌడ్ తన సిబ్బంది తో వచ్చి శిశువును ప్రభు త్వ ఆసుపత్రి తీసుకెళ్లి, చికిత్స అందించారు. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
స్థానిక పోలీసులకు రైల్వే పోలీసులు సమాచారం అందించి ఈ ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నారు. పట్టాలపై శిశువును వదిలి వెళ్లిన వారికి కఠినమైన శిక్షలు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నవ మాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి కూడా తన బిడ్డను వదులుకోవ డాన్నిఎలా ఒప్పుకుందని.. ఇంత కర్కషత్వం ఎందు కని.. ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఇలాంటి వారి కంటే, జంతువులే బెటర్ అని అనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
అయితే.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు.. పరిసర ప్రాంతం లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు అధికా రులు.. ఆ సమయంలో రైళ్ల రాకపోకలు లేకపోవడంతో చిన్నారి ప్రాణం దక్కిందని పోలీసులు తెలిపారు.