ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపాలిటీ 19వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మ్యాక ప్రవళిక శ్రీకాంత్ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆమె తన ఎన్నికల ప్రణాళికను వార్డు ప్రజల ముందుంచారు.
గతంలో తమ కుటుంబానికి ప్రజలు అందించిన ఆశీస్సులు, ఆదరణ మరువలేనివని, అదే నమ్మకంతో ఈసారి కూడా ప్రజల మద్దతుతో వార్డు అభివృద్ధికి అంకితంగా పనిచేస్తానని తెలిపారు. తమ నివాసం 19వ వార్డు మధ్యలో ఉండటంతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
తన మామయ్య మ్యాక (త్రివేణి) గంగాధర్ గారు ఆర్మూర్ పట్టణ తొలి మున్సిపల్ చైర్మన్గా అవినీతి, కబ్జాలకు తావులేకుండా అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. అదే సేవా స్ఫూర్తితో తాను ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుంటానని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సహాయసహకారాలతో రోడ్లు, డ్రైనేజీలు, NTR కాలనీకి మెయిన్ రోడ్ నుండి లింక్ రోడ్ నిర్మాణం, మహిళా సంఘాలకు శాశ్వత భవనం వంటి కీలక సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.
ఇల్లు నిర్మించుకునే వారికి మున్సిపాలిటీ అనుమతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరిస్తామని, వీధి కుక్కలు మరియు కోతుల బెడద నివారణకు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
వార్డు సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలు తమ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకే వేసి గెలిపించాలని మ్యాక ప్రవళిక శ్రీకాంత్ కోరారు.








