గద్వాల్ జిల్లా :జనవరి 04
ఆర్టీసీ బస్సులో ప్రయాణి స్తున్న క్రమంలో మరియ మ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.
ఈ క్రమంలో మరియమ్మకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో బస్సులోనే మహిళలందరూ కలిసి ఆమెకు పురుడు పోశారు. సాటి మహిళా ప్రయాణికు ల సాయం చేసి ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఈ ఘటన గద్వాల జిల్లా నందిన్నే గ్రామ సమీపంలో చోటుచేసుకుంది,
అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్టీసీ సిబ్బంది 108 అంబులెన్స్లోని వారిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. దీంతో తల్లీబిడ్డలు క్షేమం ఉన్నా రు.గతంలోనూ ఈ తరహా ఘటనలు ఆర్టీసీ బస్సులో జరిగాయి.
2024 జులైలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో పురుడు పోశారు. దీనికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వారిని అభినందించారు..