జగిత్యాల జిల్లా: జనవరి 04
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో ఎం.రామ కృష్ణరావు బదిలీ అయ్యారు. సికింద్రాబాద్ లోని గణేశ్ టెంపుల్ ఈవోగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాదాయశాఖలో ఆర్‌జేసీగా కూడా అదనపు బాధ్యతలు చూస్తున్న రామకృష్ణారావుకు ఇటీవల దేవాదాయశాఖ తరుపున ప్రభుత్వ కార్య క్రమాలకు హాజరు అవడం, కొండగట్టు దూరం కావడంతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
రామ కృష్ణారావు కొండగట్టులో ఈవోగా ఆగస్టు 1న బాధ్యతలు చేపట్టి కేవలం అయిదు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈ కాలం లో దేవస్థానం పరిధిలో అభివృద్ధి, పాలనలో, సిబ్బంది విధుల నిర్వహ ణలో పారదర్శకతకు కృషి చేశారు.
రామకృష్ణారావు స్థానంలో కొండగట్టుకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవో కె.వినోద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
బదిలీ అయిన ఈవో రామకృష్ణారావు శుక్రవారం దేవస్థానం అధికారులు, సిబ్బంది, అర్చకులు సత్కరించారు. అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించిన అనంతరం సత్కరించారు. ఆయన అం దించిన సేవలను కొనియా డుతూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో మేజర్ టెంపుల్స్ జేఏసీ నాయ కుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, పర్యవేక్షకులు హరిహరనాథ్, అశోక్, రాములు ప్రధానర్చ కులు రామకృష్ణారావు, అర్చకులు పాల్గొన్నారు.