హైదరాబాద్: జనవరి 04
కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది,
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కార్ కాలేజీల్లో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ టీజీపీఎస్పీ ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది,
వాస్తవంగా 1,392 మంది లెక్చరర్ల నియమానికి రెండేళ్ల కిందట నోటిఫికేషన్ ఇచ్చింది, వివిధ కారణాల తో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది,
దీంట్లో మల్టీ జోన్ 1,లో 581 మంది ఉండగా మల్టీజోన్ 2, లో 558 మంది ఉన్నారు. వీరందరికీ వారంలోనే నియమక పత్రాలు అందజేసేందుకు ఇంటర్మీడియట్ అధికా రులు చర్యలు తీసుకుంటు న్నారు.