నిజామాబాద్ A9 NEWS
ఆర్మూర్ కేంద్రంలో సైదాబాద్ షాదీఖానా లో సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నిర్వహించిన సదస్సులో ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షత వాయించినారు, ఈ సదస్సు లో ముఖ్య వక్తలుగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత, పార్టీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య వాళ్లు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలను అత్యాచారం చేసి ఊరేగింపు చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లకు హింసకు బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని , మణిపూర్ ఘటన పై దేశం మొత్తం విచారణ వ్యక్తం చేస్తుందని, ఒక పక్క బేటి పడావో – బేటి బచావో అని అంటున్న కేంద్ర ప్రభుత్వం అది ఇదేనా అని వారు ప్రశ్నించారు, డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి ఇదేనా అని వారు అన్నారు, మూడు నెలలకు పైగా హింస జరుగుతున్న ప్రధాన మంత్రి మౌనం వహించడం సరైంది కాదని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళ చట్టాలను పక్కాగా అమలు చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణలను నివారించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు, సిపిఎం నాయకులు కుతది ఎల్లయ్య, మార్ఖజ్ కమిటీ చైర్మన్ మొయినుద్దీన్, ఎంఐఎం కౌన్సిలర్ జహీర్, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి చిట్టక్క, అరుణోదయ జిల్లా కార్యదర్శి అబ్దుల్, పార్టీ డివిజన్ నాయకులు ఖాజా మొయినుద్దీన్,ఎస్ రవి, పి.డి.ఎస్.యూ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.