ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు..?

 

 

నిఖిల్ ఇంట్లోనే, ఎస్సై, మహిళా కానిస్టేబుల్ రాసలీలలు

 

 

మహిళా కానిస్టేబుల్ కౌగిలించుకొని, నిఖిల్ చెరువులు దూకి ఆత్మహత్య

 

 

కొద్ది దూరంలో ఎస్సై సాయికుమార్ చెరువులో ఆత్మహత్య

 

 

కామారెడ్డి జిల్లా

అడ్లూర్ చెరువులో ఎస్సై తో పాటు, మహిళా కానిస్టేబుల్, సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ ఘటన మిస్టరీగా మారింది . ఈ ముగ్గురు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అన్నది ఒక కొలిక్కి రావడం లేదు. పోలీసులు మాత్రం మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతుండగా, వారిని రక్షించడానికి వెళ్లిన ఎస్సై సాయికుమార్ ప్రమాదవశాత్తు ఈతరాక చనిపోయినట్లు వెల్లడిస్తున్నారు. అయితే నిఖిల్, శృతి చెరువు కట్టకు ఎందుకు వెళ్లారు? ఈ విషయం ఎస్ఐ సాయికుమార్ కు ఎలా తెలిసింది ? శృతికి, నిఖిల్ కు సంబంధం ఏమిటి? ఎస్సై సాయికుమార్ తో శృతికి వివహేతర సంబంధం కొనసాగుతుంది పబ్లిక్ టాక్. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు చెరువు కట్టకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.? అన్నది మిస్టర్ గా మారింది. బిబిపేట్ ఎస్సైగా పనిచేస్తున్నప్పుడు సాయికుమార్ కు, మహిళ కానిస్టేబుల్ శ్రుతి తో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. వీరిద్దరూ బిబిపేట్ సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఇంట్లో కలిసేవారు. ఆ ఇంట్లోనే విందు, పొందు నడిపించేవారు. బదిలీపై భిక్కనూర్ కు వచ్చిన ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతితో యధావిదంగా సంబంధాలు కొనసాగుతున్నాడు. వీరి మధ్యవర్తిగా నిఖిల్ పని చేస్తున్నట్లు సమాచారం. నిఖిల్ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ రిపేర్ల కోసం వాడుకునేవాడు ఎస్సై సాయికుమార్ . ఈ విధంగా వీరి ముగ్గురు మధ్య మంచి పరిచయాలు పెరిగాయి. ఎస్సై సాయి కుమార్ కు, మహిళా కానిస్టేబుల్ శ్రుతికి ఏది కావలసిన నిఖిల్ తెచ్చి పెట్టేవారు. దీని అంతటికీ ఆర్థిక సాయం ఎస్సై సాయికుమార్ అందించేవాడు. ఇలా కొన్నాళ్లుగా ఎస్ఐకి, శృతికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. గాంధారి నివాసమైన శృతికి వివాహం జరిగింది, భార్యాభర్తల మధ్య గొడవల వల్ల శృతి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. బిబిపేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. బిక్నూర్ లో ఎస్సైగా సాయికుమార్ పనిచేస్తున్నారు . బుధవారం మధ్యాహ్నం ముగ్గురు చెరువు కట్టకు వెళ్ళినట్టు సమాచారం. చెరువు కట్ట వద్ద ఏమి జరిగిందన్నది మిస్టరీ గా మారింది. నిఖిల్, శృతి ఇద్దరు కౌగలించుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది, మరికొద్ది దూరంలో ఎస్సై చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిఖిల్, శృతి ఇద్దరు కలిసి ఒకే దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడు, కొద్ది దూరంలో ఎస్సై  సాయికుమార్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు . ఇద్దరు ఒకచోట, ఎస్సై మరోచోట ఆత్మహత్య కు ఎందుకు పాల్పడ్డారు. ఎస్సై కి, శృతికి మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? తనను పెళ్లి చేసుకోమని ఎస్సై పై ఒత్తిడి తీసుకు వచ్చిందా? తీసుకొస్తే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాల్సి ఉంటుంది, నిఖిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అన్నదే అనుమానాలకు దారితీస్తుంది. ఎస్సై కి, శృతికి మధ్యవర్తిగా ఉన్న నిఖిల్ వారితో కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అన్నది తెలిస్తే పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీస్ యంత్రాంగం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు . నిఖిల్, శృతి చెరువులో పడితే కాపాడడానికి వెళ్లి ఈత రాక ఎస్సై చనిపోయినట్లు పోలీసులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. అయితే ఎస్సై ఒక్కడే కారులో వెళ్లాడా? లేక ముగ్గురు కలిసి వెళ్లారా? అన్నది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది? ఇద్దరు ఒకే చోట ఆత్మహత్యకు పాల్పడడం, ఎస్సై సాయి కమార్ మరొకచోట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంపై కారణం ఏమిటో? ఇంకా బయటపడటం లేదు. వీరు ముగ్గురు చెరువు వద్ద ఉన్నట్లు ఎవరన్నా ప్రత్యక్షంగా చూశారా? చూసినవారు ఎవరు? ఈ కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ ఏ విధంగా స్పందిస్తారో? వేచి చూడాల్సిందే.

 

కానిస్టేబుల్ శ్రుతి కుటుంబ సభ్యులు మాత్రం తన కూతుర్ని హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. కానీ ఘటన స్థలం చూస్తే ముగ్గురు కూడా ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తుంది. అసలు ఈ ముగ్గురు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రోజు కూడా ఎస్సై సాయకుమార్ కు, శృతికి మధ్య విభేదాలు బయట పడలేదు. వీరిద్దరూ మధ్య వారధిగా ఉన్న నిఖిల్ కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ బుధవారం ముగ్గురు చెరువులో దూకడం ఆత్మహత్య చేసుకోవడం, దీని వెనుక కారణాలు ఏమిటి? అన్న విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *