A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి:
మహిళా కానిస్టేబుల్ శ్రుతి మృతి దేహం మరియు సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృతి దేహలు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో లభ్యం కాగా భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ కోసం రెస్క్యూటిమ్ గాలింపు చర్యలు చేపట్టింది..
కామారెడ్డి జిల్లాలో సంచలన
ఘటన చోటుచేసుకుంది. ఓ ఎస్సె సహా మహిళా కానిస్టేబుల్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇద్దరితో పాటు మరొక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్ ఎస్సై సాయికుమార్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. బుధవారం సాయంత్రం బిబిపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎస్సై సహా కానిస్టేబుల్ ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేయగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్టుగా తెలిసింది.
బుధవారం రాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. చెరువు వద్ద ఎస్సై కారు, చెప్పులు, కానిస్టేబుల్ ఫోన్లు లభ్యమయ్యాయి. అయితే ఈ ఇద్దరితో పాటు బిబిపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా
పని చేస్తున్న నిఖిల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సొసైటీ ఆపరేటర్ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడటం సంచలంగా మారింది. చెరువు వద్దకు జిల్లా ఎస్పీ సింధూశర్మ చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సదాశివనగర్, బిక్కనూర్, కామారెడ్డి పట్టణ సిఐలు, ఎస్సైలు, పోలీసుల బృందం చెరువు వద్ద ఉండి బోటు సహాయంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు పరిధి పెద్దగా, లోతుగా ఉండటంతో పాటు చీకటి కావడంతో గాలింపునకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రిస్క్యూ టీం, అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బిబిపేట మహిళ కానిస్టేబుల్ శృతి మృతి దేహం, మరియు బీబీపేట సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి దేహాలు లభ్యం అయ్యాయి. ఎస్సై సాయికుమార్ మృతి దేహం కోసం రెస్క్యూటిమ్ గాలింపు చర్యలు చేపడుతుంది.
మహిళా కానిస్టేబుల్ శృతి స్వగ్రామం గాంధారి మండల కేంద్రం. 10 సంవత్సరాలుగా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శృతికి తల్లిదండ్రులు, చెల్లె, తమ్ముడు ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన శృతి చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే పిరికితనం లేదని ఆమె సోదరుడు నటరాజ్ తెలిపారు. గతంలో శృతికి పెళ్లయినప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుందని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటుందని తెలిసింది. చెరువు వద్ద ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెస్క్యూ టీం గాలింపులు కొనసాగుతున్నాయి.
ఎస్ఐ సాయికుమార్, మహిళా కానిస్టేబుల్ శృతిల మధ్య ఏం జరిగి ఉంటుందని, వీరిద్దరి మధ్య అధికారి, సబార్డినేట్ బంధం కాకుండా వ్యక్తిగత సంబంధం ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే భేదాభిప్రాయాలతో, ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారేమోనని అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలు నేవీ పోలీసు శాఖలోని ఏ స్థాయి అధికారి ఇంతవరకు ధృవీకరించడం లేదు. వీరితో పాటు నిఖిల్ అనే వ్యక్తి వీరి మధ్యలో ఎందుకు వచ్చాడనే అవుతున్నాయి. అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఆపరేటర్ నిఖిల్ కు ఏం సంబంధం, ఈ ఘటనతో నిఖిల్ కు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఎందుకు ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలకు ఏ ఆధారము దొరకడం లేదు. ఎస్సై సాయి కుమార్, మహిళా కానిస్టేబుల్ శ్రుతిల మధ్య ఉన్న బంధం గురించి నిఖిల్ అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా, భిక్కనూర్ ఎస్సైగా పనిచేసే సాయికుమార్, బీబీ పేటలో కానిస్టేబుల్ గా పని చేసే శృతి, ఇంకా నిఖిల్ వీరు ముగ్గురు సదాశివ నగర్ మండలం పరిధిలో ఈ చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ముగ్గురు కలిసే వచ్చారా.. లేదంటే విడివిడిగా వచ్చారా.. అనే సందేహాలకు సరైన సమాధానం దొరకడం లేదు. చెరువు వద్దకు వచ్చిన తర్వాత ఏం జరిగి ఉంటుంది? ఈ విషయంపై చర్చ జరిగి ఉంటుంది.. వీరి ఆత్మహత్యకు ప్రేరేపించిన అంత పెద్ద టాపిక్ ఏమై ఉంటుంది.. అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిని తొలిచేస్తున్నాయి.