హైదరాబాద్ :డిసెంబర్ 27
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ మీడియా సెల్ ప్రొఫెసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటనలో చెప్పారు.
గురువారం ఉదయం తన ఇంట్లో మన్మోహన్ సింగ్ స్పృహ కోల్పోయారని, వెంటనే ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నాలు జరిగాయని,ఆ ప్రకటనలో తెలిపారు.
రాత్రి 8.06గంటల ప్రాంతంలో ఆయన్ను ఎయిమ్స్‌లోని అత్యవసర సేవల విభాగానికి తీసుకొచ్చారని, వెంటనే చికిత్స అందిస్తూ ఆయన్ను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సెలవు ప్రకటించింది