మహిళలజట్టును ఘనంగా సన్మానించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి.
A9 న్యూస్ ప్రతినిధి:
రాష్ట్ర సీఎం కప్ -2024
మహిళల బేస్ బాల్ విభాగంలో నిజామాబాద్ జట్టు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో సాధించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. విజయం సాధించిన నిజామాబాద్ జిల్లా మహిళల బేస్ బాల్ జట్టును నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఘనంగా సన్మానించినరు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జిల్లాకు మొట్టమొదటి ఆరంభంగా రాష్ట్రస్థాయిలో కప్పు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ముఖ్యంగా రూరల్ ప్రాంత క్రీడాకారులు ఎక్కువగా ఉండటం నాకు చాలా సంతోషం గా ఉందన్నారు.
ఈనెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో జరిగిన రాష్ట్ర బేస్ బాల్ సీఎం కప్ పోటీలలో నిజామాబాద్ మహిళల జట్టు ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై 06-03 పరుగుల తేడాతో గెలుపొంది.
నిజామాబాద్ జట్టు బేస్ బాల్ సీఎం కప్-2024 ఛాంపియన్ గా నిలిచినట్లు డివైస్ ఓ ముత్తెన్న మరియు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ . జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు అమ్మాజీ నరేష్ టిపిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ , సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపల్ టి.నళిని, జిల్లా సోషల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, పిఈటి స్వప్న సాఫ్ట్ బాల్ బేస్బాల్ సంయుక్త కార్యదర్శి సుజాత మరియు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.