-పాల్గొన్న వినయ్ రెడ్డి ప్రత్యేక సందేశాన్ని అందించిన జాన్ వెస్లీ, ఆనంద్ పాల్

 

-క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి

 

A9 న్యూస్ ప్రతినిధి:

 

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్మూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ తోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సంఘ కాపరుల కుటుంబాలతో కలిసి వినయ్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండల దైవజనులు ఘనంగా సన్మానించారు. పాస్టర్ జాన్ వెస్లీ ఆనంద్ పాల్ లు క్రిస్మస్ ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ బండ వర్గాల సంక్షేమము కోసం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రైస్తవుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారుఆర్మూర్

నియోజకవర్గంలో క్రైస్తవులకు అండగా తానున్నానని, అన్నివేళలా క్రైస్తవుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మునుభాయ్, కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *