తెలంగాణ A9 news
స్టాఫ్ నర్స్ పోస్టుల ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఈ నెల 2న జరిగిన పరీక్షల సంబంధించిన ప్రాథమిక కీని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే 9వ తేదీలోపు mhsrb.telangana.gov.in సైట్లో ఆన్లైన్ విధానంలో నమోదు చేయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించారు.