A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోవటానికి ప్రజలు వివిధ రూపాలలో తమ నిరసనను సమస్యలను తెలియజేస్తూ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం సహజమని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ప్రజలు నిరసన వ్యక్తం చేయకుండా అధికారులు పోలీసుల ద్వారా నియంత్రణ చేస్తూ ఎవరు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేయకుండా నోటీసులను ఇస్తూ కేసులను బనయిస్తున్నారని గతంలో జిల్లా కలెక్టర్ పాత కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ కు నీ కేటాయించినప్పటికీ సౌకర్యాలు లేకుండా ప్రజలు ఎవరికీ నిరసన కనబడకుండా నాలుగు గోడల మధ్య బంధించినట్టుగా ఉందని ఆ స్థలాన్ని చదును చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని, మహిళలకు పురుషులకు విడివిడిగా టాయిలెట్లను ఏర్పాటు చేయాలని అదేవిధంగా నిరసన వ్యక్తం చేయటానికి షెడ్డును నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల కలెక్టరేట్ వద్ద ప్రజలు నిరసన వ్యక్తం చేయటానికి అవకాశం కల్పించాలని ఆయన అన్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వసతులు కల్పించని యెడల వే వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్ మరియు నాయకులు రాములు తదితరులు పాల్గొన్నారు.