A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
లిల్లీపుట్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఆర్మీ డ్రెస్ లలో అందరినీ ఎంతగానో అలరించారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ అమరవీరులను వారి త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడానికి దేశం కొరకు సాయిధ దళాల పాత్రను బలపతం చేయడానికి విజయ్ దివాస్ భారత దేశంలో జరుపుకుంటామని 1971 డిసెంబర్ 16న భారతదేశం పాకిస్థాన్ లో తలబడి విజయాన్ని సాధించినందుకు గాను విజయ్ దివస్ జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ చక్కగా పిరమిడ్ తో దృశ్యంతో అందరినీ ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ , ప్రిన్సిపాల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.