తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం.. ఇప్పుడు ఆయన సమ్మతి తెలుపడంతో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అవును, ఫార్ములా ఈ-కార్ రేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ రేస్‌లో భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు ఫైల్ పంపింది ప్రభుత్వం. తాజాగా ఆ ఫైల్‌ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ ఫైల్‌ను గవర్నర్ కార్యాలయం.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందట.
ఈ-కార్ రేస్‌లో నాటి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒప్పందానికి ముందే నిధులు చెల్లింపులు జరిపినట్లు ప్రభుత్వం గుర్తించింది. HMDA, RBI అనుమతి లేకుండానే రూ. 46 కోట్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, మాజీమంత్రి కేటీఆర్‌పై కేసునమోదు చెయ్యడానికి ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఇద్దరు అధికారులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిని పరిశీలించిన గవర్నర్.. న్యాయ సలహా అనంతరం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఆమోదంతో ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కొత్త ములపు తిరగనుంది.. *KP*