హైద‌రాబాద్ :డిసెంబర్ 26

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో అధికార‌,విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్దం తారాస్థాయికి చేరింది…

 

ముందుగా ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మం ప్రారంభం కాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు స‌ర్పంచ్ ల బిల్లుల చెల్లింపుపై ప్ర‌శ్నిం చారు. దీనిపై మంత్రి సీత‌క్క ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు..

 

కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

బంగారాన్ని తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేశారని చెప్పారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని దీన స్థితిలో సర్పంచ్ లు ఉన్నా రని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.

 

ఏకంగా ఒక్క నెల‌లోనే బ‌డా కాంట్రాక్ట‌ర్ లకు 1200 కోట్లు చెల్లించార‌ని హ‌రీశ్ స‌భ దృష్టికి తెచ్చారు.. ఇప్ప‌టికే 691 కోట్లు స‌ర్పంచ్ ల‌కు ఇవ్వాల్సి ఉంద‌న్నారు.

 

గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలు ఏమ య్యాయని ప్రశ్నించారు. గత 9 నెలలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సర్పంచ్ లకు జీతాలు లేవని చెప్పారు. బిల్లులు, జీతాలను ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.

తెలంగాణ పల్లెలను కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని హరీశ్ రావు కొనియాడారు.

 

గ్రామాలను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పా రు. కాంగ్రెస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

*మీరు పెండింగ్లో పెట్టిన అప్పులే మేము కడుతున్నాం*

 

దీనిపై మంత్రి సీత‌క్క ఘాటుగా స‌మాధానం చెబుతూ, 2014 నుంచి మీరు పెట్టిన బ‌కాయిలే అంటూ ఎత్తిపొడిచారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా స‌ర్పంచ్ బిల్లుల‌పై ఎందుకు సంత‌కం పెట్ట‌లేద‌ని నిల‌దీశారు. బిఆర్ఎస్ పార్టీ అంటే బ‌కాయిల రాష్ట్ర స‌మితి అంటూ వ్యాఖ్య‌నించారు..

 

మీరు పెట్టిన బ‌కాయిలే క్ర‌మ ప‌ద్ద‌తిలో చెల్లింపులు చేస్తున్నామ‌ని మంత్రి చెప్పారు. ఖాళీ ఖ‌జ‌నా, బ‌కాయిలు మా చేతిలో పెట్టి వెంట‌నే చెల్లించ‌మంటే ఎలా అంటూ హ‌రీశ్ కు కౌంట‌ర్ ఇచ్చారు.

 

ప‌ల్లె ప్ర‌గ‌తి నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ దుస్థితి వ‌చ్చింద‌ని సీత‌క్క వివ‌రించారు.. అయితే సీత‌క్క స‌మాధానం ప‌ట్ల సంతృప్తి చెంద‌ని బిఆర్ఎస్ స‌భ్యుల స‌భ నుంచి వాకౌట్ చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *