హైదరాబాద్: పంజాగుట్ట పోలీసుల ముందుకు ఇవాళ(సోమవారం) మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహెల్ రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16వ తేదీన పోలీసుల ముందు హాజరు అవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ గేట్లు ఢీకొట్టాడని రహేల్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత రహెల్ దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం దుబాయ్‌లో రహెల్ ఉన్నాడు. పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
అసలేం జరిగింది..
2022 మార్చిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు రీ ఓపెన్ చేశాక బాధితుల స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసు విచారణలో రహిలే ప్రమాదానికి కారణమని తేల్చారు. అయితే, జూబ్లీహిల్స్ కేసులో రహిల్‌ను తప్పించిన అప్పటి పోలీసులపై చర్యలు తీసుకున్నారు. చిన్నారిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు