సిద్దిపేట జిల్లా: డిసెంబర్ 15
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అడవిలో వదిలి వెళ్లాడో కనికరం లేని ఓ కసాయి భర్త ఈ ఘటన సిద్దిపేట జిల్లా వంటి మామిడి మండలంలోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది..
స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తూనే డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. హైదరాబాద్ వచ్చాక కూడా శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్ మాత్రలు మింగినట్లు సమాచారం.
దీంతో సృహ కోల్పోయిన భార్య రబియాను ఆమె భర్త విక్రమ్ మన్వార్ శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి మండలం లోని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడు. ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనంతరం రబియాను ఆర్వీఎం ఆస్పత్రికి తర లించి చికిత్స అనంతరం విచారించగా అసలు విషయం తెలిసింది,. అనంతరం యువతి తల్లిదండ్రులకు పోలీసులు సమాచార మిచ్చారు.