*అధికారికంగా నూతన మండలం ఏర్పాటు చేసిన సందర్భంగా 108 అంబులెన్స్ ప్రారంభం…
*నర్సాపూర్ నియోజకవర్గంలో ఇంచార్జ్ పిసిసి రాష్ట్ర కార్యదర్శి రాజిరెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్….
A9 న్యూస్ మాసాయిపేట ప్రతినిధి,డిసెంబర్ 15:
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నూతనంగా అధికారికంగా మండలం ప్రకటించడంతో నూతన మండలానికి అధికారులు రావడం జరిగిందని అన్నారు అదేవిధంగా మండలానికి ప్రజలను దృష్టిలో ఉంచుకొని 108 అంబులెన్స్ ను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట అక్కింపేట గ్రామాలలో సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి 108 అంబులెన్స్ సామాజిక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడంతో ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా మాజీ సీనియర్ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్ మాట్లాడుతూ మాసాయిపేట మండలానికి నూతన మండలంగా ఏర్పాటు చేసిన మంత్రి సీతక్క ప్రభుత్వానికి తభ్యతలు తెలిపారు అనంతరం మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మండలంలో ఉన్న 13 గ్రామాల ప్రజలకు అంబులెన్స్ మంజూరు చేయడం సంతోషం కరమైన విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం పరిధిలోని ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.