A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆర్మూర్ బస్టాండ్ లో ఆర్మూర్ నుండి అనిత అనే మహిళ బిచ్కుంద వెళ్లడానికి బస్సు ఎక్కుతున్న క్రమంలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన భూమ అనే మహిళ అనిత యొక్క పర్సు, ఫోన్ దొంగిలించడం జరిగింది. దొంగతనాల విషయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులు చాకచక్యంగా దొంగతనం చేస్తున్న భూమా అనే మహిళను పట్టుకొని బాధితురాలికి దొంగిలించిన సొత్తును అందించడం జరిగింది. దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ ఎన్.రాజశేఖర్, సిహెచ్ ప్రశాంత్ ని పలువురు అభినందించడం జరిగింది.