A9 న్యూస్ ప్రతినిధి:
బాల్కొండ మండలం దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ విగ్రహం శిథిలావస్థలో ఉంది. భావి పౌరులు ఆదర్శంగా తీసుకోవాలని పూర్వము ఇక్కడ గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు అప్పటి నాయకులు శాయాశక్తుల కృషిచేసి ఏర్పాటు చేశారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరి రెండు హస్తాలు కోల్పోయి దిక్కులేని విగ్రహంగా నిలిచింది. ప్రజా పరిపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా ఈ అంశం చర్చ నియాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, మహాత్మా విగ్రహాన్ని పునరుద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.