A9 న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిది:
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును ఆయన పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలు , భూముల వివరాలు పరిశీలించాలని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచి కరమైన భోజనం అందించాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్, ఎంపిడిఒ లు ఉన్నారు.