A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్, డిసెంబర్ 11. కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు ఆవేశంతో రెచ్చపోవడమే కాక ఒక జర్నలిస్ట్ రంజిత్ చేతిలో ఉన్న లోగోను లాక్కొని వారిపై దాడికి దిగాడం సరైన పద్ధతి కాదని .మరో పక్క మీడియా ప్రతినిధుల ఫోన్‌లను బౌన్సర్‌లు లాక్కున్నారు. మీడియా ప్రతినిధులపై మంగళవారం నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని టియుడబ్ల్యూ ఐజేయు.జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ పార్దేమ్ తీవ్రంగా ఖండిచారు. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అయన ప్రకటన విడుదల చేసారు కాగ. మోహన్ బాబు వీధి గుండాలగ ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు.
మీడియా స్వేచ్చకు భంగం కలిగించడం సరికాదని ఆయన హితవు పలికారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై సుమోటోగా తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.