రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు మార్చుతూ రూ. 51 కోట్లను మంజూరు చేసినందుకు గాను మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు.