హైదరాబాద్:డిసెంబర్ 10
కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్ను మూశారు. కొద్దికాలంగా వృద్ధాప్యం రిత్యా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నారు.
కాగా..ఈరోజు తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎంఎం కృష్ణ 1999 – 2004 మధ్య కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2018లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ఎస్ఎం కృష్ణ మృతివార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.ఎస్ఎం కృష్ణ మైసూర్ లోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యారు. అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాల లో లా పూర్తి చేశారు.
ఆ తరువాత అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెథడిస్ట్ విశ్వవి ద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన ఎస్ఎం కృష్ణ వివిధ కీలక పదవులు నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రంకు 16వ ముఖ్యమంత్రిగా, మహా రాష్ట్ర గవర్నర్ గా, కేంద్ర విదేశాంగ మంత్రిగానూ పనిచేశారు. ప్రజా వ్యవహా రాల రంగంలో ఎస్ఎం కృష్ణ అందించిన అసమాన సేవ లకుగాను కేంద్ర ప్రభుత్వం 2023లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.
అయితే, ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగినప్పటికీ.. చివరి దశలో భారతీయ జనతా పార్టీలో చేరారు.