A9 న్యూస్ డెస్క్:
మీడియా విలేకరి అంటే అంత అలుసు ఎందుకు…?
యాడ్స్ పత్రిక యాజమాన్యాలు పెట్టిన టర్గెట్లు…
రాజకీయ నాయకుల నిర్లక్ష్య ధోరణి విడాలి ఫ్రీ పబ్లిసిటీ…
అధికార పార్టీ అనా ధికార పార్టీ నేతలు మానుకోవాలి…
విలేకరుల కృషికి గౌరవం ఇవ్వాలి…
మీడియా విలేకరి లేనిదే ప్రజలకు మీ సందేశాలు చేరవని గ్రహించాలి….
ఫ్రీ పబ్లిసిటీకి అలవాటు పడి విలేకరుల కృషిని నిర్లక్ష్యం చేస్తున్నారు….
పత్రిక సంస్థల టర్గెట్లుతో విలేకరులు సిగ్గు విడిచి, విలేకరులు నేతల చుట్టూ ప్రదక్షణలు…
రాజకీయ నాయకులు ప్రచార కార్యక్రమాల కోసం లక్షలాది రూపాయలను ఫ్లెక్సీలపై ఖర్చు చేస్తున్నా, విలేకరుల కృషిని గుర్తించి పత్రికా సంస్థలకు అవసరమైన ప్రకటనలు ఇవ్వడం దాటివేత మాటలతో తప్పించుకుంటున్నారు. “మీడియా లేకపోతే మీ ప్రసారం ప్రజలకు ఎలా చేరుతుంది?” అనే ప్రశ్నకు నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
విలేకరుల నిర్లక్ష్యం: డిసెంబర్ రాగానే ప్రకటనల కోసం ఆరాటం…
డిసెంబర్ నెల ప్రారంభం కాగానే పత్రికా యాజమాన్యాలు, జర్నలిస్టులు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రకటనలు అడుగుతారు. తమ కృషితో పార్టీ కార్యక్రమాలను ఎత్తిపొడిచినా, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం ఇచ్చినా, రాజకీయ నాయకులు విలేకరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.
“మీరు చేసేది ఫ్రీ పబ్లిసిటీగా భావిస్తే, మీ ప్రచారం కొనసాగుతుందా?” అని విలేకరులు ప్రశ్నిస్తున్నారు.
ఫ్రీ పబ్లిసిటీకి అలవాటు: ప్రింట్ మీడియాకు దూరంగా రాజకీయ నేతలు…
సంవత్సరం పొడవునా కార్యక్రమాలు, ప్రాజెక్టులను మీడియా ప్రాచుర్యం కల్పిస్తే, ప్రకటనల కోసం అడిగినప్పుడు రాజకీయ నేతలు సమాధానం చెప్పకుండా “తరువాత చూద్దాం” అంటున్నారు. పత్రికా స్వేచ్ఛను ఉపయోగించుకునే ఈ నాయకులు విలేకరుల ఆర్థిక పరిస్థితులను పట్టించుకోవడం లేదు.
మీడియా గౌరవానికి అవసరమైన మార్పు…
రాజకీయ నాయకులు తమ వైఖరిని మార్చుకుని విలేకరుల కృషిని గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఫ్రీ పబ్లిసిటీకి మార్గం వదిలి, ప్రకటనల పంపిణీలో పారదర్శకతను కల్పించాలి.
పత్రికా సంస్థల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రకటనలకు న్యాయమైన భాగస్వామ్యం అందించాలి.
విలేకరుల కృషిని గౌరవించడం ద్వారా ప్రజలకు సమాచారం చేరే మార్గాన్ని కొనసాగించాలి.
“మీడియా లేకుండా రాజకీయ పార్టీలు ఉంటాయా?” అనే ప్రశ్నను తక్షణం ప్రతిపక్షాలు, అధికార పార్టీల నేతలు తమకు తాము ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. పత్రికా సంస్థలు రాజకీయ ప్రకటనలను కోరడంలో కేవలం ఆర్థిక అవసరమే ఉంది, గౌరవం చాటాలని కూడా నాయకులు గ్రహించాలి.
రిపోర్టర్‌గా చేస్తాను