A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
*ప్రభుత్వాన్ని, పార్టీని పటిష్టం చేయండి
*టిపిసిసి చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
*షాద్ నగర్ యువజన కాంగ్రెస్ నాయకుల సన్మానం
*షాద్ నగర్ యువజన కాంగ్రెస్ నేతలు అందేమోహన్, పులి మామిడి రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానం
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తూ, ఏడాదిలోనే ప్రజల మెప్పు పొందుతున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని యువజన కాంగ్రెస్ బలోపేతం చేయాలని టిపిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్, షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు పులిమామిడి రాజేష్ గౌడ్ నేతృత్వంలో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల శ్రీనాథ్, టౌన్ అధ్యక్షుడు సాయి వంశీ యూత్ కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందనీ షాద్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పులిమామిడి రాజేష్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యువజన కాంగ్రెస్ నేతలకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ప్రజలు జనరంజక పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ సేవకులుగా నిలిచిపోవాలని అన్నారు. కష్టపడ్డ వారికి పార్టీ గుర్తిస్తుందని పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా మంచి అవకాశాలు వస్తాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం యువత ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని వారికి ప్రత్యేక ప్రాధాన్యత పార్టీ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగిందని తెలిపారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా ఆయనను కలుసుకుందామని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజేష్ గౌడ్ మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, నవీన్ అజయ్, రాహుల్, ప్రవీణ్ కుమార్, లడ్డు సాయి, శీను వేణు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.