A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో చోటు చేసుకుంది 20 రూపాయల కోసమని బస్సును దాదాపు అరగంటసేపు ఆపి ప్రయాణికురాలి దగ్గర నుండి తన హ్యాండ్ బ్యాగ్ ను గుంజుకొని 20 రూపాయలకు బదులుగా తాకట్టు పెట్టుకుంది మహిళా కండక్టర. బస్సులో అంత మంది మహిళలు. ప్రయాణికులు ఉన్న ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా. 20 రూపాయలు కూడా ఇవ్వలేని దుర్భర సితి నెలకొన్న వైనం అరగంట పాటు జూదం చూస్తున్న ప్రయాణికులు తోటి మహిళలు వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కామారెడ్డి నుండి బాన్సువాడ వైపు వెళ్లే బస్సులో ఒక మహిళ ప్రయాణం చేస్తుంది అయితే ఆ మహిళ ఆధార్ కార్డు మరిచిపోయిందో లేదో పోయిందో ఆ సంగతి మహిళా ప్రయాణికురాలికి తెలియదు ఇంతలోనే సదాశివ నగర్ బస్సు స్టాప్ వచ్చింది. కండక్టర్ మరొక్కసారి టికెట్ టికెట్ అని అందరిని పలకరించగా తను ఆధార్ కార్డు కనిపించకపోవడంతో ఆధార్ కార్డు కనిపించలేదంటూ అనడంతో కండక్టర్ 20 రూపాయల టికెట్ కొట్టింది డబ్బులు ఇవ్వమని అడగగా తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది ఇప్పటివరకు ఆధార్ కార్డు తన దగ్గరే ఉందని అటు ఇటు వెతకగా ఆధార్ కార్డు కనిపించకపోవడంతో ప్రయాణిస్తున్న మహిళ నివ్వరం పోయింది. ఇలా కండక్టర్ 20 రూపాయలు ఇవ్వమని అడుగుతే డబ్బులు లేకపోవడంతో తాకట్టుగా ప్రయాణికురాలు బ్యాగును తన వద్ద ఉంచుకుంది సుధా శివనగర్ గ్రామంలో తన చుట్టాల దగ్గర నుండి 20 రూపాయలు తీసుకుని వచ్చి బ్యాగు ను తీసుకెళ్లాలని చెప్పడంతో దాదాపు అరగంట సేపు అక్కడనే బస్సును ఆపారు ఇదిలా జరుగుతుంది ఉండగా మహిళా కన్నీరు పెట్టుకుంటూ నంది విగ్రహం నుండి సదాశివ నగర్ ఊర్లో తన బంధువుల వద్ద 20 రూపాయల కోసం వెళ్తానని గ్రామంలో అక్కడ ఉన్న మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవికుమార్ కి ప్రయాణికురాలు జరిగింది మొత్తం చెప్పింది. 20 రూపాయలు వంకాయల రవికుమార్. ఇచ్చి ప్రయాణికురాలు బ్యాగు ఇవ్వాల్సిందిగా కండక్టర్ ను కోరారు. 20 రూపాయలు బదులుగా తాకట్టు పెట్టుకున్న బ్యాగును టికెట్ కొట్టి 20 రూపాయలు తీసుకొని బ్యాగులు ఇచ్చింది. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ వంకాయల రవికుమార్ మాట్లాడుతూ మహిళలు ఆధార్ కార్డు మర్చిపోయి రాకుండా ఉండాలని. ఇలా ఇబ్బంది పడద్దని అన్నారు. సాటి మైళ్లను ఇంతగా వేధించడం సబబు కాదని అన్నారు చెకింగ్ జరుగుతే తమ పరిస్థితి ఏంటని కండక్టర్ తమ ఉద్యోగాలు పోతాయని చెప్పుకొచ్చారు బాన్సువాడ డిపోకు చెందిన కండక్టర్ ప్రయాణికురాలను ఇలా చేయడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధార్ కార్డు చూసి టికెట్ కొట్టాలి కానీ. ఆధార్ కార్డు చూడకుండానే ఆర్టీసీ కండక్టర్ టికెట్ కొట్టడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆధార్ కార్డు లేకపోతే అక్కడే దించేయాలి కానీ ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో దించేయడం పట్ల ప్రజలు కండక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.