పత్రిక సమాచారం..
తిర్మన్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో TMF NZB ఆధ్వర్యంలో మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్ష పోటీల నిర్వహణ…
భారతదేశ సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జయంతి డిసెంబర్ 22 సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, గణిత ప్రతిభాపరీక్ష పోటీలు నిర్వహించడం జరుగుతుందని దాంట్లో భాగంగా ఈ సంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిర్నన్‌పల్లి నందు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్ష పోటీలు నిర్వహిస్తున్నామని టీఎంఎఫ్ ఇందల్వాయి మండల అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్,రాజు లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి శ్రీధర్ గారు మాట్లాడుతూ గణిత శాస్త్రంలో ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ చాటుతారో వారే జీవితంలో అత్యున్నత స్థాయిలో రాణిస్తారని అందుకే గణితాన్ని ఇష్టంగా నేర్చుకోవాలని సూచించారు. స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజేశ్వరి గారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ గణితశాస్త్రంలో ఆసక్తి కలిగిన వారికి మిగతా విషయాలు సులువుగా అర్థమవుతాయని వివరించారు..
జిల్లా గణితఫోరం గౌరవ అధ్యక్షులు మరియు ఎల్లారెడ్డిపల్లి కాంప్లెక్స్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మండలానికి చెందిన 09 ప్రభుత్వ పాఠశాల నుండి 32 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని ఇంగ్లీష్ మీడియం నుండి మొదటి ముగ్గురిని, తెలుగు మీడియం నుండి మొదటి ముగ్గురిని, కేజీబీవీ,రెసిడెన్షియల్, మోడల్ స్కూల్ విభాగం నుండి మొదటి ముగ్గురిని డిసెంబర్ 12 నాడు నిర్వహించే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండలంలోని గణిత ఉపాధ్యాయులు స్వప్న, అశ్విని, చంద్రకాంత్, శంకర్, సాయిలు, రామక్రిష్ణ, సంపత్, తదితరులు పాల్గొన్నారు