A9 న్యూస్ ప్రతినిధి మెదక్:
బాల్య వివాహం చట్టం అవగాహన సదస్సు బుధవారం నాడు స్థానిక కస్తూరిబా గాంధీ విద్యాలయం నందు విజన్ సంస్థ అందుబాటులో అందరికి న్యాయం ఆధ్వర్యంలో బాల్ వివాహా ముక్త్ భారత్ క్యాంపెయిన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సాధికారత సంస్థ కార్యదర్శి జితేందర్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటినుండి ధైర్యాన్ని పట్టుదలను ఆత్మవిశ్వాసాన్ని చురగొనాలని మరియు బాగా చదువుకోవాలని మంచి స్థాయిల్లో రాణించాలని విద్యార్థులకు తెలియజేశారు. మరియు ప్రస్తుత బాల్య వివాహ చట్టం గురించి ప్రభుత్వం, చట్టము మరియు స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలు గురించి తెలపడం జరిగింది. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రతినిధి సతీష్ జిల్లా బాలల సంరక్షణ అధికారి కరుణశీల మహిళా శక్తి కేంద్రం ఇన్చార్జి సంతోష మరియు కస్తూర్బా గాంధీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ కవిత, ఉపాధ్యాయురాలు స్రవంతి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్ నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపి ఈ బాల్ వివాహ ముక్తు భారత్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని 2030 లోపు భారత్ లో బాల్య వివాహాలేని భారత్ గా చూడాలని ప్రసంగించారని తెలపడం జరిగింది. ఇందుకోసం తమ సంస్థ, బాలలకు అందరికీ న్యాయం అనే కార్యక్రమంతో మెదక్ జిల్లాలో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేస్తూ బాల్యవివాహాలు లేని భారత్ గా చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు లతో ప్రతిజ్ఞ చేయించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజన్ సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ రాజు సిబ్బంది యాదగిరి రవి నవనీత మరియు కస్తూర్బా గాంధీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.