A9 news చేగుంట మెదక్ నవంబర్ 19
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళలు సమర్పించిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం గా జరుపుకుంటుందని తెలిపారు. దేశంలోని పేద ప్రజల కోసం కానా మకాన్ (భోజనము, ఇల్లు) ప్రతి పేదవారికి అందించిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ భూములను పేదవారికి పంచిన ఘనత ఇందిరాగాంధీ కి దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వలన ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు ఏం, శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్ మొజామిల్ మహేష్ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు సోషల్ మీడియా మోహన్ నాయక్ కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్ పిసెర్మన్ సోమ వెంకటేష్ జిల్లా నాయకురాలు కురుమ లక్ష్మి మాజీ దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షులు అంకన్నగారి సాయి కుమార్ గౌడ్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ మహుమద్ నదీమ్ అలీ మహేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు