ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!
A9 న్యూస్ బ్యూరో, 18:
రోడ్లపై టోల్ టాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ద్వారా వాహన డ్రైవర్లు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది. అది ఎలానో తెలుసుకుందాం..
ప్రస్తుతం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జి.ఎన్.ఎస్.ఎస్) ఉపయోగించే ప్రైవేటు వాహన డ్రైవర్లు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డ్రైవర్లు 20 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టోల్ రోడ్లు ఉపయోగిస్తే వారు ఎటువంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం జి ఎన్ ఎస్ ఎస్ వ్యవస్థను ఉపయోగించే ప్రైవేటు వాహనాల డ్రైవర్లు 20 కిలోమీటర్ల వరకు రోజువారి ప్రయాణాలను ఎటువంటి
టోల్ టాక్స్ చెల్లించే పనిలేదు. కానీ 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే మాత్రం మొత్తం దూరం ఆధారంగా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలు కానున్నది.
*జి ఎన్ ఎస్ ఎస్ విధానం….
కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ తో పాటు జి ఎన్ ఎస్ ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఆధారంగా టోల్ టాక్స్ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ విధానంకు కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరు మైసూర్ జాతీయ రహదారి, హర్యానాలోని పానిపట్ – హిసారి జాతీయ రహదారిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయితే దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వాటి వల్ల 20 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేసే వారికి టోల్ టాక్స్ ఊరట కలగనున్నది.